Saturday, June 7, 2008

బత్తి బంద్ కు ప్రచారం






జూన్ 5 వ తేదీ మాకాలేజీలో ఎన్విరాన్ మెంటల్ దినాన్ని జరుపుకొన్నాము. యాదృచ్చికంగా ఆరోజు నేను ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కావటంవల్ల, ఈ నెల 15 వ తేదీన జరపతలపెట్టిన బత్తిబంద్ కార్యక్రమాన్ని, పిల్లలకు వివరించి వారికి అవగాహన కల్గించటం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబందించిన ఫొటోను, మరియు మరునాడు పేపరులో వచ్చిన క్లిప్పింగును మన బ్లాగు మిత్రులందరితో పంచుకోవాలని ఇక్కడ పోష్టు చేస్తున్నాను.


విద్యార్ధులు గ్లోబల్ వార్మింగుపట్ల ఈ కార్యక్రమం ద్వారా మంచి అవగాహన పెంచుకొని, బత్తి బంద్ కార్యక్రమం ద్వారా మరింత ఎక్కువమందికి అవగాహన కల్పించటానికి సన్నిద్దులయ్యారు. ఈ అంశం లో నన్ను ప్రేరేపించిన, కొత్తపాళీ గారికి ధన్యవాదములు. ఇందులో సహకరించిన మా కాలేజీ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసరు, శ్రీ పి. హరిరాం ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో డా: ఎ. రమేష్ చంద్రగారు పర్యావరణ పరిరక్షణ పై మంచి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఫోటోలో మాట్లాడుతున్నది డాక్టరు గారు. మధ్యలో కూర్చొని ఉన్నది నేను. న్యూస్ అయిటము లో చాలా ముద్రా రాక్షసాలు ఉన్నాయి. (CO2 Quit the habit, Batti bandh వంటివి). ఓర్పుతో భరించగలరు.

బొల్లోజు బాబా